తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... నెల్లూరులో టిఎన్ఎస్ఎఫ్ వినూత్న నిరసన చేసింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద కొడాలి నాని చిత్రపటాన్ని చుట్టి ఫుట్బాల్ ఆడుతూ... నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు తెచ్చుకునేందుకు మంత్రులు, వైకాపా నేతలు చంద్రబాబు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదన్నారు. అధికారం ఉంది కదాని రౌడీల్లా వ్యవహరిస్తే... ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అన్నారు.
'రౌడీల్లా వ్యవహరిస్తే... ప్రజలే బుద్ధి చెబుతారు' - minister kodali nani comments on chandrababu
మంత్రి కొడాలి నాని... చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా... నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
నెల్లూరులో టి.ఎన్.ఎస్.ఎఫ్. వినూత్న నిరసన