MINISTER KAKANI COMMENTS ON MLA KOTAMREDDY : వైఎస్ జగన్ పెట్టిన రాజకీయ భిక్షతో ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శ్రీధర్ రెడ్డి పార్టీ మారడం వలన వైఎస్సార్సీపీకి నష్టం ఏం లేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 26 మంది కార్పొరేటర్లలో 16 మంది ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైపు వచ్చారన్నారు. మిగిలిన వారు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు.
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎన్నికైన తరువాత తొలిసారి నగరానికి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ నేతలు, శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. వైసీపీను వీడినందుకు కోటంరెడ్డి బాధపడే రోజు తప్పనిసరిగా వస్తుందని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. నెల్లూరు గ్రామీణ సమన్వయకర్తగా సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.