ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్​లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీలు

నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలోని కొవిడ్ కేర్ సెంటర్​ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులను పరామర్శించి.. అక్కడ వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

minister anil kumar
minister anil kumar

By

Published : Apr 23, 2021, 10:57 PM IST


నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని కొవిడ్ సెంటర్​ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వార్డులను పరిశీలించి, బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులను పరామర్శించి, వైద్యశాలలో అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తగినన్ని పడకలను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details