పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ వ్యవహారంపై తెదేపా నిర్ణయం చెప్పాలని మూడు సార్లు అడిగినా మౌనం వహించడంలో అర్థమేంటని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో పర్యటించిన ఆయన మాజీ మంత్రి దేవినేని ఉమాపై మరోసారి ధ్వజమెత్తారు. దేవినేని ఉమా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
పోతిరెడ్డిపాడుపై తెదేపా మౌనమెందుకు?: మంత్రి అనిల్ - పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌పై మంత్రి అనిల్ సమావేశం
పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తన నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో పర్యటించిన ఆయన మాజీ మంత్రి దేవినేని ఉమాపై మరోసారి విమర్శానాస్త్రాలు సంధించారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్
తెలుగుదేశం హయాంలో పోలవరానికి రూ. 17 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెడితే పర్సంటేజ్ ఎంతైందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చన్నారు. గత ఐదేళ్లలో దేవినేని ఉమా దోపిడి రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. తాను అసభ్యకరంగా మాట్లాడానని చెప్పడం దారుణమన్నారు. దేవినేని ఉమా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని... విషయం తెలుసుకోకుండానే నెల్లూరు జిల్లాలో రెండో పంటకి నీరు ఇవ్వటం లేదనడం హాస్యాస్పదమన్నారు. ఈ సందర్భంగా నాయిబ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు.