లాక్డౌన్తో నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో చిక్కుకున్న బిహర్కు చెందిన వలస కార్మికులను తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. వీరిని స్వరాష్ట్రానికి పంపించేందుకు అధికారులు ఒక్కో కార్మికుని నుంచి రూ.840 వసూలు చేయడంపై వలసజీవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్వరాష్ట్రాలకు వలస కార్మికులను పంపించేందుకు చర్యలు
నెల్లూరు జిల్లా కోవూరులో ఉన్న వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైలు ప్రయాణానికి అధికారులు డబ్బులు వసూలు చేయడంపై వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
టిక్కెట్లు చూపిస్తున్న వలస కూలీలు
ఉపాధి లేక స్వగ్రామాలకు వెళ్తుంటే ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం దారుణమని కార్మికులు ఆవేదన చెందారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చారు. బాలకృష్ణారెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు ఆహారం అందజేశారు.
ఇదీచదవండి.