ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేసీఆర్​కు హేట్సాప్ కాదు... దళితులను పట్టించుకోండి' - నెల్లూరులో మందకృష్ణ మాదిగ

ఈ నెల 20వ తేదీన నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లిలో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన యువతి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థావక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఆమెను లైంగికంగా వేధించి హత్య చేశారని ఆయన ఆరోపించారు. నిందితుడికి అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

Manda krishna madiga at nellore
బాధితులను పరామర్శించిన మందకృష్ణ మాదిగ

By

Published : Dec 23, 2019, 7:43 PM IST

Updated : Dec 23, 2019, 10:12 PM IST

బాధితులను పరామర్శించిన మందకృష్ణ మాదిగ
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లిలో ఈ నెల 20వ తేదీన ఆత్మహత్య చేసుకున్న యువతి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత యువతిని లైంగికంగా వేధించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారని ఆరోపించారు. యువతి మృతికి కారకుడైన వ్యక్తికి అధికార పార్టీ నేతల అండ ఉందని, రాజకీయ ఒత్తిళ్లతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు.

న్యాయం కోసం ఉద్యమం
యువతి మృతికి కారకులైన వారిపై అట్రాసిటీ, అత్యాచారం కేసు నమోదు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. కేసు నమోదుకు నిరాకరించిన ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. అలా జరగకపోతే దళిత వర్గాలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. యువతి మృతదేహానికి రీ-పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు బయటపెట్టాలన్నారు.

నిందితుడికి అధికార పక్షం అండ..!
దిశ నిందితుల ఎన్​కౌంటర్ విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు.. సీఎం జగన్ హేట్సాప్ చెప్పడం కాదన్న మందకృష్ణ మాదిగ... రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలన్నారు. దళితులపై దాడులకు పాల్పడినవారికి శిక్షలు పడకుండా అధికారపక్షం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం అందించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. యువతి మృతి ఘటనపై న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు.

Last Updated : Dec 23, 2019, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details