ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా లేదు అయినప్పటికీ పరిస్థితి విషమించింది - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

కరోనా సోకిందనే అనుమానంతో నెల రోజులపాటు క్వారంటైన్​లో ఉంచిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు విషమంగా మారింది. కరోనా నెగిటివ్​ వచ్చినప్పటికీ గుండె సమస్యతో రోగి అనారోగ్యానికి గురైయ్యాడు. దీంతో లాక్​డౌన్​ కారణంగా రోగిని ఆసుపత్రికి తరలించడంలో జాప్యం నెలకొంది.

naidupeta hospital
కరోనా లేదు అయినప్పటికీ పరిస్థితి విషమించింది

By

Published : May 5, 2020, 4:44 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి రోగిని నెల్లూరు ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడం పరిస్థితి విషమంగా మారింది. ఓజిలి మండలం కార్జింబేడు గ్రామానికి చెందిన ఖాదర్ బాషా ఇటీవల దిల్లీ సభలకు వెళ్లి వచ్చాడు. కరోనా వైరస్ సోకుతుందనే అనుమానంతో భార్యతో కలిసి నెలరోజుల పాటు క్వారంటైన్​లో ఉంచి పరీక్షలు చేశారు. ఫలితాలు నెగిటివ్ రావడం వల్ల అతన్ని ఇంటికి పంపించారు. గుండె పరమైన సమస్యలతో అనారోగ్యానికి గురైన ఖాదర్​ భాషాకు నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేశారు. అనంతరం నాయుడుపేటలోని తమ్ముడు ఇస్మాయిల్ వద్ద నివాసం ఉంటున్నాడు. ఈ తరుణంలో మళ్లీ గుండె పరమైన సమస్యలు తలెత్తడం వల్ల నాయుడుపేట అసుపత్రిలో చికిత్స చేశారు. రోగిని నెల్లూరుకు తరలించడంలో జాప్యం జరగడం వల్ల పరిస్థితి విషమంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details