MAN DIED DUE TO ELECTRIC SHOCK: కరెంటు తీగలు తగిలి నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మాండౌస్ తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులకు.. ఇనమడుగు గ్రామం ఎస్టీ కాలనీలో చెట్టు విరిగి కరెంటు తీగలపై పడింది. దీంతో కరెంటు తీగలు తెగి కిందపడ్డాయి. ఈ తీగలు తగిలి విద్యుదాఘాతంతో దార్ల శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో కరెంటు తీగలపై కూలిన చెట్టు.. వ్యక్తి మృతి - మాండౌస్ తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురు గాలులు
MAN DIED DUE TO ELECTRIC SHOCK : మాండౌస్ తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాలో తీవ్రంగా ఉంది. తుఫాన్ వల్ల ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. వాటి ప్రభావానికి చెట్లు నెలకూలుతున్నాయి. జిల్లాలోని కోవూరు మండలంలో చెట్టుకూలి కరెంట్ తీగలపై పడింది. అవి తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
కరెంటు తీగలు తాకి వ్యక్తి మృతి
Last Updated : Dec 10, 2022, 9:54 PM IST