నేటి నుంచి నెల్లూరులో లాక్‌డౌన్ అమలుకానుంది. నెల్లూరు జిల్లాలో 3,117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే 1600 పైగాకోవిడ్ కేసులు నిర్ధరణయ్యాయి. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాలు కొనుక్కునేందుకు అధికారులు అనుమతినిచ్చారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని కలెక్టర్ చక్రధర్ బాబు తెలియజేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి స్వచ్ఛంద ఆంక్షల అమలుకు విజ్ఞప్తి చేశారు. అవసరం లేనిదే ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు, వ్యాపారుల సహకారించాలని ఆయన కోరారు.
నేటి నుంచి నెల్లూరులో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు
నెల్లూరు నగరంలో కరోనా కేసులు విజృంభిస్తున్నందున అధికారులు అప్రమత్తయ్యారు. నేటి నుంచి నెల్లూరులో లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అమలుచేయనున్నారు. అవసరం లేకపోతే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని కలెక్టర్ చక్రధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ చక్రధర్ బాబు