ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయండి' - NELLORE LATEST NEWS

ఈ నెల 4,5 తేదీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. పలు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించనున్నారని వివరించారు. కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జనసేనాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 4,5 తేదీల్లో నెల్లూరులో పవన్ కల్యాణ్ పర్యటన
ఈ నెల 4,5 తేదీల్లో నెల్లూరులో పవన్ కల్యాణ్ పర్యటన

By

Published : Dec 1, 2020, 4:05 PM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 4, 5 తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జనసేన నేతలు ప్రకటించారు. నాలుగో తేదీ ఉదయం నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో పర్యటించి సాయంత్రం నెల్లూరు చేరుకుంటారని తెలిపారు. 5వ తేదీ మీడియాతో మాట్లాడి, నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించి, రేణిగుంట చేరుకుంటారని ఆ పార్టీ నేతలు కిషోర్, వెంకటేశ్వర్లు, సుజయ్ బాబులు వివరాలు వెల్లడించారు. జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని, జనసేనాని పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి

పెన్నా వరదల్లో.. కొట్టుకొచ్చిన వింత జంతువు మృతదేహం

ABOUT THE AUTHOR

...view details