నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని వెంకటాద్రిపాలెం క్వారీలోని నీళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను ఆత్మకూరు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 107 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశామని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తెలిపారు. వీటిని ఆత్మకూరు రేంజ్ ఆఫీస్కు తరలిస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు.
నీటిలో దాచారు... అధికారులు పట్టుకున్నారు - నెల్లూరు జిల్లా నేర వార్తలు
నెల్లూరు జిల్లా వెంకటాద్రిపాలెంలో నీటిలో దాచిన ఎర్రచందనం దుంగలను సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నీటిలో దాచిన ఎర్ర చందనం దుంగలను పట్టుకున్న అధికారులు