నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నుంచి భారీగా నీరు కిందకు వదిలారు. సంగం వద్ద పంట పొలాలకు వెళ్లే రహదారిలో బీరాపెరు వాగులో లారీ, ట్రాక్టర్ చిక్కుకున్నాయి. నీటి ప్రవాహం పెరుగుతుండగా... వాహనాలను వదిలి 12 మంది కూలీలు అతికష్టం మీద బయటపడ్డారు. ఉదయం నీటి ప్రవాహం లేకపోవడంతో పంట పొలాలకు వరికోత కోసం వెళ్లిన కూలీలు... ధాన్యం లోడుతో తిరిగి వస్తుండగా... ఒక్కసారిగా బీరాపెరు వాగు పొంగి నీటి ప్రవాహం పెరిగింది.
వాగులో చిక్కుకున్న వాహనాలు..సురక్షితంగా బయటపడ్డ కూలీలు - heavy rain in nellore
నెల్లూరు జిల్లా సంగం వద్ద పంట పొలాలకు వెళ్లే రహదారిలో బీరాపెరు వాగులో లారీ, ట్రాక్టర్ చిక్కుకున్నాయి. వాహనాలను వదిలి 12 మంది కూలీలు అతికష్టం మీద బయటపడ్డారు.
వాగులో చిక్కుకున్న వాహనాలు.. సురక్షితంగా బయటపడ్డ కూలీలు