ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో వర్షాలు.. ఉద్ధృతంగా బొగ్గేరు వాగు ప్రవాహం - rain news in nellore district

నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బొగ్గేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

heavy-rain-in-nellore

By

Published : Oct 16, 2019, 3:08 PM IST

నెల్లూరులో వర్షాలు-ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బొగ్గేరు వాగు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు...సన్నవారిపల్లి వద్ద బోగ్గేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఐదేళ్లుగా నీళ్లు లేని బొగ్గేరు ఒక్కసారిగా ఉరకలు వేస్తోంది. ఈ ప్రవాహాన్ని చూడటానికి స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రవాహం మరింత పెరిగితే ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరమని తెలిసినా... తప్పనిసరి పరిస్థితుల్లో బొగ్గేరు వాగు వరద నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే క్రిష్ణాపురం బీసీ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. సంగం మండలంలో చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చెరింది. పనులు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details