ఏపీ ఎన్జీవో నాయకులు 103 జీవో రద్దుపై కాకుండా.... ఉద్యోగుల సమస్యలపై పోరాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి.... ప్రభుత్వ గుర్తింపు రావడం పట్ల అన్నీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉన్న సంఘాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందనే విషయం గుర్తించాలని హితవు పలికారు.
'ఏపీఎన్జీవో నాయకులు ఉద్యోగుల సమస్యలపై పోరాడాలి' - ap ngo
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి... ప్రభుత్వ గుర్తింపు రావడం పట్ల ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవో సంఘ నాయకులు జీవో 103 రద్దు పై కాకుండా ఉద్యోగస్తుల సమస్యలపై పోరాడాలని సూచించారు.
'ఏపీ ఎన్జీవో నాయకులు ఉద్యోగుల సమస్యలపై పోరాడాలి'