లాక్డౌన్ నేపథ్యంలో నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.ఎస్. విభాగం ఆధ్వర్యంలో హిజ్రాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. 200 మంది హిజ్రాలకు బియ్యం, కూరగాయలు, సరకులు అందజేశారు. నెల్లూరు రూరల్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఉమ్మారెడ్డిగుంటలో పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలుగు యువత నాయకులు తెలిపారు.
హిజ్రాలు, పేదలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి నిలిచిపోవడంతో కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించి.. కొందరు వీరికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.
హిజ్రాలకు, పేదలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ