ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dagadarti Airport: దగదర్తి విమానాశ్రయం డీపీఆర్‌ తయారీకి అయిదు సంస్థల ఆసక్తి!

నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయం డీపీఆర్‌ తయారీకి అయిదు సంస్థల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ మేరకు ఆ సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి.

Dagadarti Airport
Dagadarti Airport

By

Published : Jun 4, 2021, 7:56 AM IST

నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారీ కోసం అయిదు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. రైట్స్‌ లిమిటెడ్‌(గుడ్‌గావ్‌), డార్ష్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ముంబయి), వోయంట్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(హైదరాబాద్‌), ఎస్‌టీయూపీ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ముంబయి), మిన్‌హార్డ్‌ సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(నొయిడా) సంస్థలు డీపీఆర్‌ తయారీకి ఆసక్తి చూపాయి. ఆయా సంస్థలు దాఖలు చేసిన సాంకేతిక, ఆర్థిక బిడ్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెండర్ల ప్రక్రియను ఇన్‌క్యాప్‌ పర్యవేక్షిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details