నెల్లూరు జిల్లా మర్రిపాడులోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడం వల్ల భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొద్దిమేర ఆస్తి నష్టం వాటిల్లినప్పటికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని హోటల్ యజమానులు తెలిపారు.