నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చుక్కల భూముల రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చుక్కల భూముల రైతులకు న్యాయం చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించిందని...ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్నిసార్లు కోర్టులు ఆదేశించిన వారికి మాత్రం న్యాయం చేయడం లేదంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నామని... ఇకనైనా అధికారులు స్పందించి చుక్కల భూముల రైతులను ఆదుకోవాలని వారు కోరారు. జాతీయ రహదారి అవ్వటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆత్మకూర్ ఆర్డిఓ సువర్ణమ్మ అక్కడికి చేరుకుని రైతుల విషయంలో సానుకూలంగా స్పందించారు. వెంటనే పరిష్కారం చూపుతామని వారు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
చుక్కల భూముల రైతులకే చుక్కెదురైంది
ఎన్ని ప్రభుత్వాలు మారినా...కోర్టు ఎన్ని ఆదేశాలు జారీ చేసిన వారి సమస్యలను తీర్చే వారే కరువయ్యారు. ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు చుక్కల భూముల రైతులు.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు