నెల్లూరు జిల్లా కావలి మండలంలోని అన్నగారిపాలెం పంచాయతీలోని చిన్ననట్టు గ్రామానికి చెందిన వాయిల వెంకటేశ్వర్లు బీటెక్ వరకు చదువుకున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు ఐఏఎస్ అధికారిగా ఒక ఐడి కార్డు సృష్టించుకుని పలువురిని మోసగించసాగాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ మొబైల్ దుకాణంలో 35 వేల రూపాయల మొబైల్ కొనుగోలు చేసి నగదు లేవు చెక్కు ఇస్తానని చెప్పి నకిలీ చెక్కు ఇచ్చాడు. దుకాణం యజమాని బ్యాంకులో చెక్కు మార్చుకోటానికి వెళ్లి.. అందులో నగదు లేవని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్నాడు. కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి ఒక మొబైల్ ఫోను, నకిలీ ఐఏఎస్ ఐడీ కార్డు, బ్యాంకు పాస్ బుక్, చెక్ బుక్ స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ నేరాలు..