ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మృతులంతా తమిళులే.. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాం' - chennai people died in nellore road accident updates

నెల్లూరు జిల్లా దామరమడుగు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం... డ్రైవర్ నిద్రమత్తు కారణంగా జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

nellore road accident
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Mar 28, 2021, 8:10 AM IST

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు బాంబే జాతీయ రహదారిపై జరిగన ఘోర రోడ్డు ప్రమాదంలో.. మరణించిన 8 మంది తమిళనాడులోని చెన్నై వాసులే అని పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న లారీని వీరి టెంపో వాహనం ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఆలయాల సందర్శన చేసి.. శ్రీశైలం నుంచి నెల్లూరు వస్తుండగా ఘటన జరిగిందని చెప్పారు.

"ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఏడుగురు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. డ్రైవర్ నిద్రమత్తు ఘటనకు కారణమై ఉండొచ్చు. ఘటన జరిగినప్పుడు పొగ మంచు కూడా ఎక్కువగా ఉంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం. దర్యాప్తు చేసి వెల్లడిస్తాం." - పోలీసులు

ABOUT THE AUTHOR

...view details