వినియోగదారులకు విక్రయించే కూరగాయల తూకాలు కచ్చితంగా ఉండేటట్టు చూడాలని... నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసు నాయుడు సూచించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ఆవరణంలో మార్కెట్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు.
మార్కెట్ కు వచ్చే వినియోగదారులకు కూరగాయల ధరలను అందుబాటులో ఉంచి విక్రయించాలని తెలిపారు. అలాకాకుండా అధిక ధరలకు విక్రయిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి షాపు నందు కూరగాయల ధరల వివరాల బోర్డులను విధిగా ఏర్పాటు చేయాలన్నారు.