నెల్లూరులో నిరుపేదలకు భోజనం ప్యాకెట్ల పంపిణీ - corona news in nellore
లాక్డౌన్ కారణంగా భోజనం లేక అవస్థలు పడుతున్న నిరుపేదలకు నెల్లూరు నగరంలో స్వచ్ఛంద సంస్థల వారు ఆహారం పంపిణీ చేస్తున్నారు.
నెల్లూరులో నిరుపేదలకు భోజనం ప్యాకెట్ల పంపిణీ
నెల్లూరులో జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో 500 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. జనవిజ్ఞాన కార్యకర్తలే భోజనాలు తయారు చేసి వాటిని ద్విచక్ర వాహనాలపై నగర శివారు కాలనీలకు తీసుకువెళ్లి పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం భోజనం ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు.