వైద్యుడిని శిక్షించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నర్సు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిని శిక్షించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైద్యశాలలో పని చేసే నర్సులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వైద్యుడు రవీంద్రనాథ్ను శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో మళ్లీ ఇలాంటి అరాచకాలు జరగకుండా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వచ్చే రోగులకు భరోసా కల్పించాలన్నారు. వైద్యశాలలో తమతో పాటు పనిచేసే ఉద్యోగుల పట్ల వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమన్నారు. వైద్యశాలలో పని చేసే నర్సులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.