ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడి: నెల్లూరులోని పలు డివిజన్లలో రెడ్ జోన్ - నెల్లూరులో కరోనా రెడ్ జోన్లు

నెల్లూరు నగరంలోని 43, 47 డివిజన్​లను అధికారులు కరోనా రెడ్​జోన్లుగా ప్రకటించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

నెల్లూరులోని పలు డివిజన్​లలో రెడ్ జోన్
నెల్లూరులోని పలు డివిజన్​లలో రెడ్ జోన్

By

Published : Apr 1, 2020, 1:05 PM IST

నెల్లూరులోని పలు డివిజన్లలో రెడ్ జోన్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెల్లూరు నగరంలోని 43, 47వ డివిజన్​లను అధికారులు రెడ్ జోన్​గా ప్రకటించారు. ఈ డివిజన్ పరిధిలోని కొంతమంది దిల్లీలో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. డివిజన్ ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రజలెవరినీ బయటకు రానివ్వకుండా, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 64మందిని ఐసోలేషన్​లో ఉంచామని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ సూచనలను పాటిస్తే.. వైరస్​ను నిర్మూలించవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details