నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దుర్గంపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి 9 రోజుల క్రితం చెన్నై నుంచి గ్రామానికి వచ్చారు. వారిలో దంపతులిద్దరికీ కొవిడ్ నిర్ధరణ అయ్యింది. అప్రమత్తమైన అధికారులు వారిని నెల్లూరుకు తరలించారు.
దుర్గంపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు
నెల్లూరు జిల్లా దుర్గంపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని క్వారంటైన్‌కు తరలించిన అధికారులు గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దుర్గంపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్సును అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి శ్రీకళ, ఎంపీడీవో వీరాస్వామి గ్రామ ప్రజలకు సూచనలు ఇచ్చారు. కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు.
ఇవీ చదవండి... పారిశుద్ధ్య సిబ్బందిలో ఒకరికి కరోనా.. మిగతా సిబ్బంది ఆందోళన