ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈజీఎస్ నిర్వాకం: బయట బతికే ఉన్నాడు.. రికార్డుల్లో చంపేశారు! - MNREGS AP Latest News

ఈజీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం.. రికార్డుల్లో ఓ వ్యక్తి చావుకి కారణమైంది. కరోనా కారణంగా.. ప్రైవేట్ ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి.. ఉపాధి హామీ పనికి వెళ్లాలని సిబ్బంది దగ్గరికి వెళ్లగా... రికార్డుల్లో అతను మరణించినట్టు ఉంది. అది తెలుసుకుని అవాక్కైన ఆ వ్యక్తి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో జరిగింది.

బయట బతికే ఉన్నాడు.. రికార్డుల్లో చంపేశారు!
బయట బతికే ఉన్నాడు.. రికార్డుల్లో చంపేశారు!

By

Published : Jun 1, 2021, 5:15 PM IST

సురేంద్ర

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామానికి చెందిన సురేంద్ర.. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కరోనా కారణంగా ప్రైవేట్ స్కూల్స్ మూసివేయడంతో.. బతుకుదెరువు కోసం ఉపాధిహామీ పనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. పేరు నమోదు చేసుకునేందుకు.. ఫిల్డ్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్లగా.. అప్పటికే పేరు నమోదైందని.. ఎంపీడీవో ఆఫీస్​కు వెళ్లి కలవాలని సూచించారు.

ఎంపీడీవో ఆఫీస్​కు వెళ్లీ ఈజీఎస్ సిబ్బందిని కలవగా.. కంప్యూటర్​లో చూశారు. అతని పేరు నమోదవ్వడమే కాకుండా.. రికార్డుల్లో మృతిచెంది ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధితుడు.. బతికి ఉండగానే చంపేస్తారా..? అని అధికారులను నిలదీశాడు. 15 రోజుల్లో సరిచేస్తామని అధికారులు హామీఇవ్వగా వెనుదిరిగాడు.

ఇదీ చదవండీ... 'ఆనందయ్య మందు తితిదే ఆధ్వర్యంలో తయారు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'

ABOUT THE AUTHOR

...view details