ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం కొనసాగింపు

నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సేవలు కొనసాగనున్నాయి. ఈ మేరకు అందులోని సిబ్బంది మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని.. భారతీయ భాషా సంస్థ సమాచారం పంపింది.

telugu classical centre
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం కొనసాగింపు

By

Published : Apr 6, 2021, 9:31 AM IST

నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సేవలను కొనసాగించాలని భారతీయ భాషా సంస్థ నిర్ణయించింది. అందులోని సిబ్బంది మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని సమాచారం పంపింది. భాషా సాహిత్యం, చరిత్ర, సంస్కృతీ వికాసమే లక్ష్యంగా ఏర్పాటైన తెలుగు, కన్నడ, ఒడియా భాషల విశిష్ట అధ్యయన కేంద్రాలను విలీనం చేయడం ద్వారా కొత్తగా భాషా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి అధ్యయన కేంద్రాల సేవలను నిలిపేస్తున్నట్లు భారతీయ భాషా సంస్థ ప్రకటించింది. దీనిపై భాషావేత్తల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’, 'ఈటీవీ భారత్​' లో ‘విలీనం దెబ్బ‘ శీర్షికన కథనం వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రాలను కొనసాగిస్తూ భాషా సంస్థ నిర్ణయం తీసుకుంది.

ABOUT THE AUTHOR

...view details