ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాల మధ్య కంప కంచెలు...ఘర్షణలు

పలు గ్రామాల్లో రోడ్లపై కంప వేయడం వివాదాలకు దారి తీస్తోంది. లాక్​డౌన్ పరిస్థితుల్లో ఎవరూ వారి గ్రామాల్లోకి రాకూడదని హెచ్చరికలు చేయడమే కాకుండా గ్రామాల్లోకి ప్రవేశించకుండా ముళ్ల కంచెలు వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ పలువురు ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారు.

By

Published : Apr 5, 2020, 1:35 PM IST

clash between two villages over corona fear
గ్రామాల మధ్య కంప కంచెలు... గొడవలు

గ్రామాల మధ్య కంప కంచెలు... గొడవలు

నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రోడ్లపై కంప వేయడం వివాదాలకు దారితీస్తోంది. లాక్​డౌన్ పరిస్థితుల్లో ఎవరూ వారి గ్రామాల్లోకి రాకూడదని హెచ్చరికలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులో కంప వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు గ్రామాల్లోకి పోలేని పరిస్థితి ఉంది.

విడవలూరు మండలంలో ఇటువంటి పరిస్థితుల్లో రెండు గ్రామాల మధ్య తీవ్రస్థాయిలో రాళ్లు రువ్వుకున్నారు. లక్ష్మీపురం, కొత్తూరు రెండు గ్రామాల మధ్య కంప వేసుకున్నారు. కొందరు కంప తీయమని కోరడం... మరొకరు కుదరని చెప్పడంతో వివాదం పెరిగి.. రాళ్లు రువ్వుకున్నారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు మోహరించారు.

ఇదీ చదవండీ... నెల్లూరు: ముందు పాజిటివ్.. తర్వాత నెగెటివ్

ABOUT THE AUTHOR

...view details