నెల్లూరు జిల్లాలోని రైతులు వేల ఎకరాల భూమిని త్యాగం చేస్తే కృష్ణపట్నం పోర్టు ఏర్పాటయిందని సీఐటీయూ విశాఖ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు అన్నారు. పరిశ్రమ వస్తే తమకు ఉపాధి లభిస్తుందని ఆశించిన ప్రజలకు యాజమాన్యం నిరాశనే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని విమర్శించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జగ్గు నాయుడు హెచ్చరించారు.
కార్మిక చట్టాలను అమలుచేయాలని సీఐటీయూ నిరసన
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో యాజమాన్యం కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. కృష్ణపట్నం పోర్టులో విధులు నిర్వహిస్తున్న 500 మంది కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ సీఐటీయూ.. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది.
కార్మిక చట్టాలను అమలుచేయాలని సీఐటీయూ నిరసన