నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేశ్ కుమార్ తనకు కరోనా పాజిటివ్ సోకింది. ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని.. అధికారులను, వైకాపా నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి రమేశ్ కన్నుమూశారని, ఈ రాష్ట్రంలో అసలు పాలనా యంత్రాంగం ఉందా? అని ప్రశ్నించారు. తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు ఓట్లేసి అధికారమిచ్చిందని చంద్రబాబు నిలదీశారు. ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదంటూ సంబంధించిన విడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
'నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు.. నేడు లేరు'
నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు, నేడు లేరు.. ఇదేనా మీ నాడు-నేడు అని తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వం పై మండిపడ్డారు. గురుదేవో భవః అని భావించే సమాజం మనదని గుర్తుచేశారు.
chandrababu on nellore headmaster corona death