calender in match box: ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ ఉంటుంది.. అది అవసరాన్ని బట్టి ప్రదర్శిస్తుంటారు. నూతన సంవత్సరం సందర్బంగా నెల్లూరు జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు తన ప్రతిభను చాటారు. ప్రతి ఒక్కరికీ నిత్యం అవసరమైన కేలండర్‌ను తనదైన స్టైల్లో అతిచిన్నగా రూపొందించి శభాష్ అనిపించుకుంటున్నారు.
Calender In Match Box: అగ్గిపెట్టెలో పట్టే క్యాలెండర్.. సుక్ష్మకళాకారుడి టాలెంట్ - నెల్లూరు జిల్లా వార్తలు
calender in match box: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరానికి చెందిన సూక్ష్మకళాకారుడు ఆలూరు రామాచారి తన టాలెంట్‌ను ప్రదర్శించారు. నూతన సంవత్సరం సందర్బంగా అగ్గిపెట్టెలో పట్టేంత క్యాలెండర్‌ను రూపొందించారు. శుక్రవారం దీన్ని ఆవిష్కరించారు.
అగ్గిపెట్టెలో పట్టే క్యాలెండర్
మనుబోలు మండలం యాచవరానికి చెందిన సూక్ష్మకళాకారుడు ఆలూరు రామాచారి 2022నూతన సంవత్సరం సందర్భంగా అతి చిన్న కేలండర్‌ను రూపొందించారు. అది ఎంత చిన్నదంటే.. అగ్గిపెట్టెలో పట్టేంతగా. చిన్న కేలండర్ కదా అందులో ఏముందిలే అనుకోకండి.. వారాలు, తిథులు, నక్షత్రాలు, పండగల వివరాలన్నీ అందులో ఉండడం విశేషం.
ఇదీ చదవండి: