నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షం అరటి రైతుకు తీవ్ర నష్టం కలిగించింది. వద్దిగుంటకండ్రిగ గ్రామంలో రైతు సాగు చేసిన అరటి తోట నేలవాలి భారీగా నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న సాగుకు భారీ వర్షం రావడంతో పండు నేలవాలింది. 10 నుంచి 20 లక్షల ఖర్చు నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నాడు.
అకాల వర్షానికి నష్టపోయిన అరటి రైతు - నాయుడు పేట తాజా వార్తలు
వద్దిగుంటకండ్రిగలో అరటి సాగు చేసిన రైతుకు గురువారం కురిసిన అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
అకాల వర్షంతో నష్టపోయిన అరటి రైతులు