ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్​లో తీగ లాగితే, నెల్లూరులో డొంక కదిలింది..! నెల్లూరు హజరత్ దర్గా పీఠాధిపతి అరెస్టు

Baba cheated a woman: పెళ్లి చేసుకుంటానని యువతులను లోబర్చుకుని.. మోసం చేస్తున్నాడనే ఆరోపణలపై, ప్రఖ్యాత నెల్లూరు హజరత్ దర్గా పీఠాధిపతి బాబా భాషాను పోలీసులు అరెస్టు చేశారు. పేదకుటుంబాల బలహీనతలను ఆసరా చేసుకుని.. ఇలాంటి మోసాలకు పాల్పడుతాడనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్​లో కూడా ఓ యువతిని కూడా పెళ్లి పేరుతో మోసం చేశాడనే ఫిర్యాదుతో.. బాబా భండారం బయటపడింది.

baba
baba

By

Published : Feb 12, 2023, 7:36 PM IST

Baba cheated a woman: నెల్లూరు జిల్లా ఏఎస్​పేటలోని ప్రఖ్యాత హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా పీఠాధిపతి హఫీజ్ పాషా ను తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. చైన్నైకి చెందిన ఒక మహిళను పెళ్ళి చెసుకుంటాను మోసం చేశాడని గతంలో ఇతని మీద ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. కాగా ఇతని మీద కేసులు పెట్టినవాళ్ళ పై తనకున్న పలుకబడిని ఉపయోగించి తప్పుడు కేసులు మోపి ఇబ్బంది పెట్టిన ఆరోపణలు ఉన్నాయి.

నిందితుడు హఫీజ్ పాషా బాబా

భక్తి శ్రద్ధలతో అనేక ఇబ్బందులతో దర్గాకు వచ్చిన భక్తులను తన మాయ మాటలతో లోబరుచుకొనేవాడని ఇప్పటికే స్థానికులు ఆరోపిస్తున్నారు. దెయ్యం పట్టిందనో లేక ఆరోగ్యం బాగ లేదనో దర్గాకు వచ్చిన యువతులను లోబర్చుకొని కుదిరితే లైంగికంగా అనుభవిస్తూ.. మాయ మాటలు చెబుతూ పెళ్లిళ్లు చేసుకునేవాడని ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి.

హైదరాబాదులో కూడా ఓ మహిళ విషయంపై కేసు పెట్టగా హైదరాబాద్​లో తనకున్న పలుకుబడితో దానిని మాఫీ చేసుకున్నారు.. ఇక్కడి పీఠాధిపత్యాన్ని ఉపపీఠాధిపతి అంటూ పేరు పెట్టి కుమారులకు అప్పజెప్పి తరచూ హైదరాబాదులోనే ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పోతూ ఉన్నారు. హైదరాబాదులోని భక్తులకు బోధన చేయడానికి వెళుతూ ఉన్నారని స్థానికులు భావిస్తూ వచ్చారు.

ఒక్కసారిగా నేడు ఏడు పెళ్లిళ్ళు వివాదం తెరపైకి రావడం హఫీజ్ పాషా అరెస్టైన విషయం తెలియగానే స్థానికంగా ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. తనపై ఎవరు ఫిర్యాదు చేసిన వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై హైదరాబాద్​ నుంచి కోర్టులో ప్రైవేటు కేసులు వేసి..నోటీసులు పంపించి ఇబ్బందులు పెట్టేవాడని స్దానికులు ఆరోపిస్తున్నారు.

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన బాబా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details