నెల్లూరు జిల్లాలో ఓ డ్రైవర్ లైగింక వేధింపులు భరించలేక... ఆటోను పెట్రోలు పోసి తగల బెట్టిందో మహిళ. ఆటో డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తి తన కూతుర్ని వేధించే వాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. రోజురోజుకూ ఆ డ్రైవర్ వేధింపులు ఎక్కువయ్యాయని... తన కూతురు ఆటో తగలబెట్టి ఎటో వెళ్లిపోయిందని తెలిపింది. ఉదయం నుంచి తమ కూతురు కనిపించటంలేదనీ ఆందోళన వ్యక్తం చేసింది. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఇద్దరు పిల్లలతో బాధితురాలు పుట్టింట్లోనే ఉంటుంది.
వేధింపులు తట్టుకోలేక... ఆటోను తగలబెట్టేసింది..! - auto fired by women in nellore
తనను లైంగికంగా వేధిస్తున్నాడని... ఆటోను తగలబెట్టింది ఓ మహిళ. ఈ ఘటన తరువాత బాధిత మహిళ కనిపించకుండా పోవటంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
వేధింపులు తట్టుకోలేక... ఆటోను తగలబెట్టేసింది!