ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో విద్యుత్ కోతలు.. ఆక్వా రైతుల ఆవేదన - AQUA SECTOR IS BOOMING WITH POWER CUTS

ఆక్వా రంగానికి విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. ఎడా పెడా విద్యుత్ కోతలతో నెల్లూరు జిల్లాలో ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. జిల్లాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా సాగుని... విద్యుత్ కోతలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. కరెంట్‌ కోతలకు భయపడి కొందరు సాగును తగ్గించగా.. మరికొందరు సాగునే వదిలేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

AQUA SECTOR
AQUA SECTOR

By

Published : Apr 28, 2022, 5:58 AM IST

నెల్లూరు జిల్లాలో సుమారు 70వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. తీరప్రాంత మండలాలైన ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, సర్వేపల్లి, చిల్లకూరు, కోట,వాకాడు తదితర మండలాల్లో ఎక్కువగా ఆక్వాసాగు ఉంది. 24గంటలు విద్యుత్ సరఫరా అవసరమైన ఈ రంగానికి విద్యుత్‌ కోతలు ప్రమాద ఘటింకలు మోగిస్తున్నాయి. కరెంట్‌ లేకుంటే రేడియోటర్లు పనిచేయవని.. గాలి ఆడకపోతే చెరువులోని రొయ్యలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు.. ఆక్వా రైతుల ఆవేదన

అధికారులకు ఈ పరిస్థితి తెలిసినా.. విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో ఇవ్వడంలేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఎడాపెడా విద్యుత్ కోతలతో తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. విద్యుత్ కోతల కారణంగా కొందరు రైతులు జనరేటర్లు పెట్టుకున్నా.. అది మరింత ఆర్థిక భారమవుతుందని అంటున్నారు. సమస్యని విద్యుత్ అధికారులకు విన్నవించినా..పట్టించుకోవడంలేదని ఆక్వా రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కరెంట్‌ కోతలు లేకుండా చూడాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:విద్యుత్ కోతలు.. ఆక్వా రైతుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details