కొవిడ్‌పై పోరులో ముందుండి వైద్యులు నిరంతరం శ్రమిస్తున్న వేళ..వారికి తోడ్పాటునందించే రీతిలో నెల్లూరు యువకుడు తయారు చేసిన రోబో ఆసక్తి రేపుతోంది. నగరానికి చెందిన పర్వేజ్ హుసేన్ తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివారు. కొవిడ్ బాధితుల వద్దకు వెళ్లి సేవలందించడం సవాలుగా మారిన వేళ.... కేవలం 80 వేల ఖర్చుతో ఆయన ఓ రోబోను తీర్చిదిద్దారు. ఏపీఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఇందుకవసరమైన సహకారం అందించింది. సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ ఈ విలక్షణ రోబోను ఆవిష్కరించగా.... నెల్లూరు జీజీహెచ్ కొవిడ్ వైద్యశాలలో వినియోగించనున్నారు. నెల్లూరు రోబోట్ అని అర్థం వచ్చేలా నెల్ బాట్ అనే పేరు పెట్టారు.
రోగులతో మాట్లాడి అవసరాలు తీరుస్తుంది..