శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మంగళవారం ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ వ్యాధి సోకినట్లు అధికారులు తెలియజేశారు. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అన్ని కార్యాలయాలు, దుకాణాలు మూసేశారు. పాజిటివ్ కేసులు నమోదైన సంబంధిత వ్యక్తులు ఇళ్ల వద్ద నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
నాయుడుపేటలో 5 కరోనా కేసులు నమోదు - naidupeta latest corona news
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మంగళవారం ఐదుగురికి కొవిడ్-19 సోకింది. అధికారులు అప్రమత్తమై పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. ఆ ప్రదేశాల్లో ఉన్న దుకాణాలు, ఇతర కార్యాలయాలన్నీ మూసేశారు.
నాయుడుపేటలో పెరుగుతున్న కొవిడ్ కేసులు