నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 443 గ్రామ వాలంటీరు పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా పంచాయతీ అధికారి ఎం.ధనలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల ఎంపీడీవోలు ఈనెల 17వ తేదీ నోటిఫికేషను విడుదల చేస్తారని చెప్పారు. ఈ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణులైన 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలలోపు వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపాలని సూచించారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 21వ తేదీ పరిశీలన, ఈనెల 22 నుంచి 24 వరకు ఇంటర్య్వూలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంపికైన వారు 25వ తేదీ నుంచి పోస్టుల్లో చేరి విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీపీవో
నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 443 వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీపీవో ఎం.ధనలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
volunteer posts