ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూములు ఇవ్వలేదని దౌర్జన్యం.. పెదగార్లపాడు రైతుల ఆందోళన

Farmers agitation in Palnadu District: శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇవ్వనందుకు దౌర్జన్యంగా పంట వేసి ఉన్న పొలాన్ని నాశనం చేశారంటూ.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుని, అక్రమ డాక్యుమెంట్స్ పుట్టించి రిజిస్ట్రేషన్ చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

palnadu distric
పెదగార్లపాడు రైతులు ఆందోళన

By

Published : Jan 3, 2023, 2:56 PM IST

Farmers agitation in Palnadu District: శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి తమ భూములను ఇవ్వలేదని దౌర్జన్యంగా పంట వేసి ఉన్న పొలాన్ని నాశనం చేశారంటూ.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రైతులు ఆందోళనకు దిగారు. చేతికొచ్చిన పైరు పంటను నాశనం చేసిన శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.

''శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు ఒక సంవత్సరం నుండి మా భూములు అమ్మాలని అడుగుతున్నారు. మేము అమ్మడం ఇష్టం లేక నిరాకరించాం. మేము భూములు ఇవ్వట్లేదని శ్రీ సిమెంట్ వారు వినుకొండ మాణిక్యారావు 'పుల్లయ్య' అనే పేరు మీద దొంగ డాక్యుమెంట్స్ పుట్టించి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈరోజు మేము లేని సమయం చూసి పొలం అంత తొక్కించి నాశనం చేస్తూ రోడ్డు వేసుకుంటూ వెళ్లారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయ్యాలి'' -పెదగార్లపాడు రైతులు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details