ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లి వైసీపీలో కలవరం.. అంబటిపై వ్యతిరేకమా?.. చిట్టా విజయభాస్కర్ రెడ్డిపై అభిమానమా! - news on Sattenapalli

Chitta Vijaya Bhaskar Reddy పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో స్వరం మారుతున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో వైఎస్ఆర్ అభిమానుల పేరిట ఏర్పాటు చేసిన సమావేశం.. ఆ పార్టీలో చర్చాంశనీయంగా మారింది. ఈ సారి సత్తనపల్లి నుంచి తానే పోటీ చేస్తానని ఆ పార్టీ నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే చర్చ.. నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.

Chitta Vijaya Bhaskar Reddy
సత్తెనపల్లి

By

Published : Apr 2, 2023, 4:23 PM IST

Updated : Apr 3, 2023, 6:39 AM IST

Chitta Vijaya Bhaskar Reddy on Sattenapalli Seat: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశం పేరుతో వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డి అధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సత్తెనపల్లి నుంచి తానే పోటీ చేస్తానని విజయభాస్కర్ రెడ్డి ప్రకటించటం.. నియోజకవర్గంలో హాట్ టాపిక్​గా మారింది. త్వరలో అధిష్ఠానాన్ని కలిసి సత్తెనపల్లి సీటు విషయం మాట్లాడుతానని విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనాకి సత్తెనపల్లి నియోజకవర్గవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరు కావడం.. చర్చాంశనీయమైంది.

సత్తనపల్లి నుంచి అంబటి రాంబాబు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్థుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విజయభాస్కర్ రెడ్డి సీటును ఆశించడంతో స్థానిక వైసీపీలో నేతల్లో కలవరం మెుదలైంది. సీటు కేటాయించే అంశంపై అధిష్ఠానంతో మాట్లాడుతానాంటూ వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఏర్పటు చేసిన సమావేశంలో ఆయన వెల్లడించారు. విజయభాస్కర్ రెడ్డి ప్రకటనతో సమావేశానికి వచ్చిన వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు బహిరంగంగానే అంబటిపై పరోక్షవిమర్శలు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో చిట్టాకు మద్దతిస్తాం: వైఎస్‌ఆర్‌ అభిమానుల పేరిట ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి భేటీకి వైసీపీ నేతలు ,కార్యకర్తలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు చిట్టా విజయ్‌భాస్కర్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న కొందరు నాయకులు, కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో చిట్టాకు మద్దతిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న పలువురు స్థానిక నేతలు మంత్రి అంబటిపై పరోక్ష విమర్శలు చేశారు. వైసీపీపై అసమ్మతి కాదంటూనే అంబటిపై అసంతృప్తి వెళ్లగక్కారు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని అంబటిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

పార్టీని బలహీనపరుస్తున్నారు: జగన్‌కు మంచిపేరు వచ్చేలా పనిచేయడం లేదని అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా చిట్టా మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. స్థానిక నాయకత్వాన్ని బలపరచాలని చిట్టా విజయ్‌భాస్కర్ కార్యకర్తలను కోరారు. కార్యకర్తలు తనకు అండగా ఉంటే ప్రాణాలు అడ్డుపెట్టయినా సీటు సాధిస్తానని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే సత్తెనపల్లిలో పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుందని చిట్టా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో రెండు గ్రూపులు ఉన్నాయనీ.. పార్టీ పునాదులు బలహీనపరచాలని కొందరు నేతలు యత్నిస్తున్నారంటూ చిట్టా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని బలహీనపరిచే నేతలను అడ్డుకుంటానని చిట్టా విజయ్‌భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్‌ను రోజూ పొగడడం విధేయత కాదని తెలిపారు. సత్తెనపల్లిలో అంబటిని కాదని విజయభాస్కర్​కు వైసీపీ నుంచి టికెట్ లబించే అంశంపై గుసగుసలు మెుదలయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated : Apr 3, 2023, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details