ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM

ఏపీ ప్రధాన వార్తలు

top news
top news

By

Published : Dec 20, 2022, 3:00 PM IST

  • ఛీ.. మీరు పాలకులా?.. ట్విట్టర్​ వేదికగా మంత్రి అంబటిపై మండిపడ్డ చంద్రబాబు
    CHANDRABABU FIRES ON AMBATI: మంత్రి అంబటి రాంబాబు లంచం అడిగారన్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఛీ.. మీరు పాలకులా అంటూ చంద్రబాబు ట్విట్టర వేదికగా మండిపడ్డారు. మరోవైపు లంచం అడిగనట్లు ఆరోపిస్తే రాజీనామా చేస్తానన్న అంబటి వ్యాఖ్యలపై జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిగో నీ లంచాల బాగోతం.. రాజీనామా ఎప్పుడు అని నిలదీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైఖరితో తీవ్ర ఒత్తిడి, మనోవేదనకు గురవుతున్నాం'
    AP VRO ASSOCIATION : ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైఖరితో తీవ్ర ఒత్తిడి, మనోవేదనకు గురవుతున్నామని.. వీఆర్వోల సంఘం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. పని ఒత్తిడితో.. వీఆర్వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ... ఇద్దరికీ తీవ్ర గాయాలు
    Two Lorrys Accident: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతినగా క్యాబిన్​లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
    ROAD ACCIDENT : అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ వ్యక్తులు ప్రాణాలు కొల్పోయారు. హిందుపురానికి మిరపకాయల విక్రయానికి వెళ్లిన.. కడప జిల్లా ప్రొద్దుటూరు వాసులకు మృతువు ఐచర్​ రూపంలో వచ్చి ప్రాణాలు తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • షెడ్యూల్​ కంటే ముందే ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
    డిసెంబర్ 29 వరకు జరగాల్సిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగానే డిసెంబర్23న ముగియనున్నాయి.
    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే వారం ముందుగా డిసెంబర్ 23న ముగిసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. డిసెంబర్ 7న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29న ముగియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శరవేగంగా రోడ్లు, సొరంగాల నిర్మాణం.. చైనా బార్డర్​లో భారత్​ దూకుడు
    చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ అరుణాచల్‌ప్రదేశ్‌లో రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలను భారత్‌ యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు ఎదురైనా సరిహద్దులకు వేగంగా సైనిక బలగాలను తరలించేందుకు వీలుగా వీటిని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ నిర్మిస్తోంది. చైనాతో సరిహద్దు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గ్రామాలను రహదారులతో అనుసంధానించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'శునకం' వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలు చెప్పేదేలేదన్న ఖర్గే
    కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఆయనవి అభ్యంతరకర వ్యాఖ్యలని, క్షమాపణ చెప్పాల్సిందేనని భాజపా డిమాండ్‌ చేసింది. కానీ, ఇందుకు ఖర్గే ససేమిరా అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
    Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అనుకున్నట్టే జరిగింది... హిట్​మ్యాన్​తో పాటు అతడు కూడా..
    గాయపడిన కెప్టెన్​ రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు బంగ్లాతో జరగబోయే రెండో టెస్టుకు దూరంకానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే హిట్​మ్యాన్​తో పాటు మరో కీలక ప్లేయర్​ కూడా అందుబాటులో ఉండడని తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టార్ హీరోకు చేదు అనుభవం.. చెప్పు విసిరి దాడి.. అదే కారణమా?
    చిత్ర ప్రమోషనల్​లో పాల్గొన్న స్టార్ హీరోపై చెప్పులు విసిరి దాడి చేశాడు ఓ వ్యక్తి. అసలేం జరిగిందంటే..వివాదాస్పద వ్యాఖ్యలతో కొద్దికాలంగా హాట్​టాపిక్​గా మారిన కన్నడ హీరో దర్శన్​కు చేదు అనుభవం ఎదురైంది. చిత్ర ప్రమోషన్​లో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసిరి దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details