తిరువూరు ఎమ్మెల్యే అలక.. ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు - వైకాపా అసమ్మతి ఎమ్మెల్యేల అలక
13:56 April 11
మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో ఇంటికే పరిమితంమైన రక్షణనిధి..
Tiruvuru MLA Rakshana Nidhi: నూతన కేబినేట్ నేపథ్యంలో వైకాపాలో రోజురోజుకూ అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి అసమ్మతి వ్యక్తం చేశారు. అధిష్టానంపై అలిగిన రక్షణనిధి.. కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో ఇంటికే పరిమితమయ్యారు.
వైకాపాలో భగ్గుమన్న అసమ్మతి:మంత్రివర్గంలో చోటు దక్కని వైకాపా నాయకుల్లో ఆగ్రహ జ్వాలలు చల్లారట్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, అన్నా రాంబాబు, పార్థసారథి, ఉదయభాను సహా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయా నాయకుల అనుచరులు కూడా మండి పడుతున్నారు. మరోపక్క వైకాపా అధిష్ఠానం బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది.