ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీటీడీకి పది టన్నుల కూరగాయలు విరాళం.. - Vijayawada latest news

Ten tons of vegetables were given to TTD: ముక్కోటి ఏకాదశి సందర్భంగా కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. 2000 సంవత్సరం నుంచి ఏటా ముక్కోటి ఏకాదశి సందర్భంగా టీటీడీకి కూరగాయలు సమర్పిస్తున్నామన్నారు. తిరుమలేశుని అనుగ్రహంతో తమ వ్యాపారాలు సజావుగా సాగాలని స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు..

Ten tons of vegetables were given to Tirumala Tirupati Devasthanam
తితిదేకు పది టన్నుల కూరగాయలు విరాళం అందించిన కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం

By

Published : Dec 31, 2022, 5:15 PM IST

Ten tons of vegetables were given to TTD: ముక్కోటి ఏకాదశి సందర్భంగా కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర‌్యంలో పది టన్నుల కూరగాయలను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని అసోసియేషన్‌ కార్యాలయం వద్ద కూరగాయల లారీకి ప్రత్యేక పూజలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణస్వామి, ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి వీర వెంకయ్య తదితరులు పచ్చజెండా ఊపి లారీని తిరుమలకు పంపారు. 2000 సంవత్సరం నుంచి ఏటా టీటీడీకి ముక్కోటి ఏకాదశి సందర్భంగా తమ అసోసియేషన్ తరుఫున కూరగాయలు సమర్పిస్తున్నామన్నారు. తిరుమలేశుని అనుగ్రహంతో తమ వ్యాపారాలు సజావుగా సాగాలని స్వామిని వేడుకుంటున్నట్లు చెప్పారు.

తితిదేకు పది టన్నుల కూరగాయలు విరాళం అందించిన కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం

ABOUT THE AUTHOR

...view details