Suspicious Death Of Farmer RFSL Director: మాజీ ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ డైరెక్టర్ జక్కరాజు శివకుమార్ విజయవాడలోని డీ.వీ. మేనర్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 5వ తేదీన బందరు రోడ్డులో డీ.వీ. మేనర్ హోటల్లో ఆయన రూమ్ తీసుకున్నాడు. రూమ్ నుంచి 24 గంటల పాటు ఎటువంటి అలజడి లేకపోవడంతో.. హోటల్ సిబ్బంది మరోక తాళంతో గది తలుపు తెరిచి చూడగానే.. విగత జీవిగా పడి ఉన్నాడు.. హోటల్ సిబ్బంది మాచవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే ఘటనా స్థాలానికి పోలీసులు చేరుకున్నాడు.. మృతుడు హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని.. మలేషియన్ టౌన్షిప్ లో నివాసం ఉంటున్న వ్యక్తిగా గుర్తించిన పోలీసులు, కుటుంబీకులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాజీ ఆర్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి..
Suspicious Death Of Farmer RFSL Director: హైదరాబాద్కు చెందిన మాజీ ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ డైరెక్టర్ జక్కరాజు శివకుమార్ విజయవాడలో ఓ హెటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..దర్యాప్తు ప్రారంభించారు..
మాజీ ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ డైరెక్టర్