ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ఇచ్చిన హామీలు నేరవేర్చాలి - గళమెత్తిన సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు - Protests in AP

Statewide Samagra Shiksha Abhiyan Employees Strike: ఇచ్చిన హామీలను గాలికొదిలేసి సీఎం జగన్‌ మోసం చేశారంటూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు రోడ్డెక్కారు. సమాన పనికి సమానవేతనం అమలు చేయాలంటూ పట్టుబట్టారు. ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

samagra_shiksha_abhiyan
samagra_shiksha_abhiyan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 12:08 PM IST

Statewide Samagra Shiksha Abhiyan Employees Strike:సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం దిగివచ్చే తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

Visakhapatnam:విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత నాలుగు నెలలుగా తాము వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తమ న్యాయమైన కోరికలను విన్నవిస్తూ తెలియపరిచామని అన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

నాలుగేళ్లయినా తీరని అంగన్వాడీల సమస్యలు - నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె

Anakapalli District:అనకాపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో పెద్ద ఎత్తున సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

Vijayawada:విజయవాడ ధర్నాచౌక్‌లో సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. పీఆర్​సీ అమలు చేయకపోగా నెలల తరబడి వేతన బకాయిలు పెట్టడం దుర్మార్గం అన్నారు. చాలి చాలని జీతాలతో పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మరణిస్తున్న పట్టించుకునే దిక్కే లేదన్నారు.

పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత - మంత్రి బుగ్గనకు అంగన్వాడీల వినతిపత్రం

Vizianagaram:విజయనగరం కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు సమస్యలు పరిష్కరించమని సమ్మెకు దిగారు. గత నాలుగు నెలల నుంచి సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు వేయకుండా నిధుల్ని వేరే పథకాలకు ఉపయోగించుకుని తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలనే డిమాండ్లతో సమ్మెకు దిగామని తెలిపారు.

Nellore:నెల్లూరు డీఈవో కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.

సాగునీటి కోసం నిరసన - రైతులతో పాటు ఎమ్మెల్యే పయ్యావులపై కేసు

Annamaya District:అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదవి విరమణ బెనిఫిట్స్ పీఎఫ్, వడ్డీ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల నిరసనకు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం మద్దతు తెలిపారు.

Tirupati: ఉద్యోగులను రెగ్యులర్‍ చేయాలని కోరుతూ తిరుపతి పాత మున్సిపల్‍ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షా అభియాన్​లో పనిచేస్తున్న ఒప్పంద, పోరుగు సేవల ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్‍ చేశారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. హెచ్​ఆర్‍ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నామని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details