ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nara Lokesh Comments on CM Jagan: వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం: లోకేశ్‌

Nara Lokesh Comments on CM Jagan: రాష్ట్రంలో తొమ్మిది నెలల తర్వాత టీడీపీ అధికారంలోకి రాబోతోందని, వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కాయమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని పాదయాత్రలో హమీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.. ఆపని చేయకపోగా రకరకాల పేర్లతో వీధికో మద్యం దుకాణం ఏర్పాటు చేశారని లోకేశ్‌ మండిపడ్డారు.

Nara_Lokesh_Comments _on_CM_Jagan
Nara_Lokesh_Comments _on_CM_Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 8:23 AM IST

Nara Lokesh Comments on CM Jagan: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం శ్రేణుల్ని వేధిస్తోందని.. వారికి రిటర్న్‌గిఫ్ట్‌ ఖాయమని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేశ్​ హెచ్చరించారు. అక్రమ కేసులకు భయపడొద్దు అంటూ శ్రేణుల్లో ధైర్యం నింపారు. ఎక్కువ కేసులు వున్నవారికి నామినేటెడ్ పదవులు ఉంటాయని భరోసా ఇచ్చారు.

Construction Workers Met Lokesh in Gannavaram: నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా.. మెరుగైన పాలసీతో గత వైభవం: లోకేశ్

Nara Lokesh Selfie Challenge with Liquor Walkin Store: అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని పాదయాత్రలో హమీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.. ఆపని చేయకపోగా రకరకాల పేర్లతో వీధికో మద్యం దుకాణం ఏర్పాటు చేశారని లోకేశ్‌ మండిపడ్డారు. జే బ్రాండ్‌ మద్యంతో లక్షలాది మంది మహిళల తాళిబొట్లు తెంచుతూ, తాడేపల్లి ప్యాలెస్‌ ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్​ జిల్లా గన్నవరం నియోజకవర్గం చిన్నఅవుటపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. లిక్కర్‌ వాకిన్‌ స్టోర్‌ వద్ద సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. మద్యపానం నిషేధించాకే మళ్లీ ఓట్లడుగుతానని చెప్పిన జగన్‌.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జనం వద్దకు వెళతారని ప్రశ్నించారు. ఆత్కూరు సహకార సంఘంలో ఉద్యోగులు మూడు కోట్లు స్వాహా చేశారని, 150 కుటుంబాలు నష్టపోయాయని, నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని బాధితులు లోకేశ్‌కు తెలిపారు.

TDP Leaders Lash Out at YCP Leaders: రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఇంటికెళ్లడం ఖాయం: గన్నవరం సభలో టీడీపీ నేతలు

Lokesh Yuvagalam Padayatra in Gannavaram Constituency: పెద్దఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు మీదుగా బాపులపాడు మండలం అంపాపురంలోని విడిది కేంద్రం వరకు లోకేశ్‌ యాత్ర కొనసాగింది. లోకేశ్‌ పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. తెలుగు యువత నాయకులు పుదీనాతో రూపొందించిన భారీ గజమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతీ, యువకులు, మహిళలు మార్గమధ్యలోని కూడళ్ల వద్ద లోకేశ్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. చిన్నఅవుటపల్లి వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో నారా లోకేశ్‌ను తల్లి భువనేశ్వరి కలిశారు. లోకేశ్‌ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేడు పట్టిసీమ కాల్వను పరిశీలించనున్న లోకేశ్‌.. మల్లవల్లిలో భోజన విరామం అనంతరం స్థానికులతో సమావేశం కానున్నారు. సాయంత్రానికి నూజివీడు నియోజకవర్గంలోకి లోకేశ్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది.

Nara Lokesh Public Meeting in Gannavaram: "ఇసుక దందాలో జగన్‌ రోజూ రూ. 3 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు"

Police Notices to Lokesh Comments in Gannavaram Public Meeting: ఈ నెల 22న లోకేశ్‌ యువగళం పాదయాత్ర బహిరంగ సభ నిర్వహణపై పోలీసులు బుధవారం నోటిసులు ఇచ్చారు. తొలుత లోకేశ్‌కు నేరుగా నోటీసులు ఇచ్చేందకు యత్నించి వెనక్కి తగ్గారు. సభాధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావుకు మాత్రంఉంగుటూరు మండలం ఆత్కూరు స్టేషన్‌కు పిలిపించి నోటిసులిచ్చారు. గన్నవరంలో సభకు అనుమతినిచ్చినప్పుడే ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం, వ్యక్తులు, సమూహాలుగా చట్టాన్ని ఉల్లంఘించకూడదనే నిబంధనలు పెట్టామని పోలీసులు తెలిపారు. లోకేష్, అయ్యన్నపాత్రుడు తమ ప్రసంగాల్లో ముఖ్యమంత్రి, మంత్రి రోజాను కించపరిచే విధంగా మాట్లాడారని.. నిబంధనలు ఉల్లంఘించినందున చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

Lokesh Yuvagalam Padayatra: 'గన్నవరం గడ్డ - తెలుగుదేశం అడ్డా'.. జనసందోహంతో దుమ్మురేపుతున్న లోకేశ్ పాదయాత్ర..

ABOUT THE AUTHOR

...view details