Statewide Municipal Workers Strike : జగన్ మొండి అయితే మేము జగమొండి అంటూ పారిశుద్ధ కార్మికులు 9వ రోజు సమ్మె ఉద్ధృతం చేశారు. జీతాలు పెంచబోమన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు జిల్లాల వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించారు. నగర ప్రాంతాల్లో ప్రైవేటు కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. వారిని సమ్మెలో ఉన్న వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు.
Guntur : జీతాలు పెంచబోమన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు గుంటూరులో ర్యాలీని నిర్వహించారు. న్యాయబద్ధంగా సమ్మెను కొనసాగిస్తుంటే పోలీసులు తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి సీఎం జగన్ మాట తప్పారని ఆరోపించారు. తెనాలిలో ప్రైవేట్ వ్యక్తులతో చెత్త సేకరిస్తున్న వాహనాలకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాష్ట్రాన్ని సమ్మె ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విపక్ష నేతలు విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు టీడీపీ, జనసేన నేతలు సంఘీభావం తెలిపారు.
డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికుల ధర్నా
Prakasam : పాదయాత్రలో తమ సమస్యలను అన్ని పరిష్కరం చేస్తానన్న సీఎం జగన్ ఇప్పుడు తమ బాధలు కనిపించడం లేదా అని ప్రకాశం జిల్లా కార్మికులు నిరసనకు దిగారు. 9 రోజులు పాటు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న సీఎం జగన్ ఒక్కసారి కూడా స్పందింలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anantapur :తమ న్యాయబద్ధ డిమాండ్లను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలని రాయదుర్గం పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుని, తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష శిబిరం వద్ద సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం చిత్త శుద్ధితో ఇప్పుటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Panladu :పల్నాడు జిల్లా నరసరావుపేటలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె శిబిరాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే అనుచరులే శిబిరాన్ని ధ్వంసం చేశారని కార్మికులు ఆరోపించారు. ఈ సంఘటన వల్ల కార్మికుల శిబిరం వద్ద ఉద్ధృత వాతావరణం నెలకొంది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న సమయంలో కార్మికులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు దీక్ష శిబిరాన్ని ధ్వంసం చేసి ఉంటారని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
సమ్మెకు సిద్ధమైన మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
West Godavari : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పారిశుద్ధ్య కార్మికులు ప్రధాన రహదారిపై భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అది చేస్తా ఇది చేస్తా మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక తమను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో కచ్ఛింతగా గద్దెను దించుతామని హెచ్చరించారు.
Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి దీక్షకు దిగారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చారించారు.