ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగా.. కానీ..: సినీనటుడు సుమన్‌

HERO SUMAN ON JAGAN: ఓటీటీల్లో వచ్చే వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలతపై సెన్సార్‌బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. పి.నైనవరంలో సుమన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

HERO SUMAN ON JAGAN
HERO SUMAN ON JAGAN

By

Published : Jun 19, 2022, 11:08 AM IST

HERO SUMAN ON JAGAN: ఓటీటీల్లో వచ్చే వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలతపై సెన్సార్‌బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. విజయవాడ గ్రామీణ మండలం పి.నైనవరంలో సుమన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లగా ఓటీటీ ప్రభావం పెరిగిందని, ఇదే సమయంలో వాటిల్లో వస్తున్న వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలత చోటు చేసుకుంటుందని చెప్పారు.

దీనిపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తీస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు ఈ విషయమై దృష్టి సారించాలని సూచించారు. ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. లోకేషన్లు, పోలీసు బందోబస్తు, త్వరితగతిన అనుమతి మంజూరు వంటి సదుపాయాలు కల్పిస్తే చాలామంది ఇక్కడ సినిమాలు తీయడానికి ముందుకు వస్తారని సుమన్‌ పేర్కొన్నారు. తాను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేనని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ దొరకలేదని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details