ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం అమలు వాయిదా.. ఎప్పటివరకంటే? - plastic flexi ban postponed

ban on flexi postpone
ban on flexi postpone

By

Published : Oct 31, 2022, 7:24 PM IST

Updated : Oct 31, 2022, 7:48 PM IST

19:19 October 31

నిషేధం అమలు ఉత్తర్వులను జనవరికి 26కు వాయిదా వేస్తూ నిర్ణయం

PLASTIC FLEXI BAN IMPLEMENTATION POSTPONED : ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రభుత్వం వాయిదా వేసింది. నిషేధం అమలు ఉత్తర్వులను జనవరికి 26కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం.. నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. దీంతో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల రద్దు జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి సాయం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సామగ్రిని మార్చుకునేందుకు 20 లక్షల రూపాయల వరకు ఫ్లెక్సీ తయారీదారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను రద్దు చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. కాలుష్య నివారణ పేరిట గతంలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 31, 2022, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details