ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యామ్నాయం చూప‌కుండా ఫ్లెక్సీల నిషేధం.. ల‌క్షలాది మంది రోడ్డున ప‌డ్డారు: నారా లోకేశ్‌

Flexes are banned: ప్రత్యామ్నాయం చూప‌కుండా ఫ్లెక్సీలపై నిషేధం విధించ‌డంతో ల‌క్షలాది మంది కుటుంబాల‌తో న‌డిరోడ్డున ప‌డ్డారని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఫ్లెక్సీలు త‌యారు చేసే యూనిట్లపై ఆధార‌ప‌డి జీవిస్తున్న వారితో క‌నీసం చ‌ర్చించ‌కుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రక‌టించి జీవో నెంబ‌ర్ 65 తీసుకురావ‌డం అనాలోచిత చ‌ర్యని మండిపడ్డారు. ఫ్యాబ్రిక్ క్లాత్ అందుబాటులోకి తెప్పించి... దీనికి త‌గిన శిక్షణ ఇచ్చిన త‌రువాతే ఫ్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తే బాగుంటుందని లోకేశ్‌ సూచించారు.

Flexes are banned without showing an alternative
Flexes are banned without showing an alternative

By

Published : Jan 21, 2023, 2:16 PM IST

Flexes are banned: ప్రత్యామ్నాయం చూప‌కుండా ఫ్లెక్సీలపై నిషేధం విధించ‌డంతో ల‌క్షలాది మంది కుటుంబాల‌తో న‌డిరోడ్డున ప‌డ్డారని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ప్రింటింగ్ పరిశ్రమపై ఆధార‌ప‌డి జీవిస్తున్న య‌జ‌మానులు, ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం నెర‌వేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఫ్లెక్సీలు త‌యారు చేసే యూనిట్లపై ఆధార‌ప‌డి జీవిస్తున్నవారితో క‌నీసం చ‌ర్చించ‌కుండా ఫ్లెక్సీల‌ను నిషేధం విధిస్తున్నట్టు ప్రక‌టించి జీవో నెంబ‌ర్ 65 తీసుకురావ‌డం అనాలోచిత చ‌ర్యేనని లోకేశ్‌ మండిపడ్డారు.

ఫ్లెక్స్ ప్రింట‌ర్‌ను క్లాత్ ప్రింట‌ర్ మిష‌న్​గా అప్​గ్రేడ్ చేసుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామ‌ని... ఇచ్చిన హామీ మ‌రిచిపోవ‌డంతో, బ్యాంక‌ర్లు లోన్లు ఇవ్వడంలేదని అన్నారు. ఫ్యాబ్రిక్ క్లాత్ అందుబాటులో లేద‌ని, మిష‌న్ల అప్​గ్రేడ్​కి అవ‌కాశంలేద‌ని, ఇటువంటి ప‌రిస్థితిలో నిషేధానికి మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌ని కోరుతున్న ఫ్లెక్స్ యూనియ‌న్ డిమాండ్​ని సానుకూలంగా ప‌రిశీలించాలని కోరారు.

మాన‌వ‌తా దృక్పథంతో ఆలోచించి సీఎం ఇచ్చిన హామీ మేర‌కు మిష‌న్ల అప్​గ్రేడ్ చేసుకోవ‌డానికి బ్యాంకు రుణాలు ఇప్పించి, ఫ్యాబ్రిక్ క్లాత్ అందుబాటులోకి తెప్పించి, దీనికి త‌గిన శిక్షణ ఇచ్చిన త‌రువాతే ఫ్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం విధిస్తే బాగుంటుందని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details